విజయ్ దేవరకొండ తుఫానుకి సూపర్ రెస్పాన్స్!
on Feb 1, 2022

ఈ జనరేషన్ యంగ్ హీరోలలో ఏ హీరోకి సాధ్యం కానీ విధంగా అతి తక్కువ కాలంలో నేషనల్ వైడ్ గా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. సామాన్యులే కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం విజయ్ స్టైల్ కి, ఆటిట్యూడ్ కి ఫిదా అవుతున్నారు. దీంతో పలు కార్పొరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ని యూత్ లోకి తీసుకెళ్లడం కోసం విజయ్ ని సంప్రదిస్తున్నాయి. ఈ క్రమంలో విజయ్ తాజాగా ప్రముఖ కూల్ డ్రింక్ 'థమ్స్ అప్' కి బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు.
గతంలో 'థమ్స్ అప్' బ్రాండ్ అంబాసిడర్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి వారు పని చేశారు. ఇప్పుడు వారి స్థానంలోకి రౌడీ హీరో విజయ్ రావడం విశేషం. 'సాఫ్ట్ డ్రింక్ కాదు.. ఇది తుఫాన్' అంటూ విజయ్ తో ప్రమోషన్స్ షురూ చేసింది థమ్స్ అప్. ఇక విజయ్ పై తెరకెక్కించిన యాడ్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ యాడ్ లో విజయ్ స్టంట్స్ హాలీవుడ్ సినిమాని తలపిసున్నాయి.
విజయ్ థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తుండగా బాయ్ 'థమ్స్ అప్' బాటిల్స్ తీసుకొచ్చి 'సార్ సాఫ్ట్ డ్రింక్' అంటాడు. 'సాఫ్ట్ డ్రింకా?!' అంటూ విజయ్ థియేటర్ స్క్రీన్ వైపు చూపిస్తాడు. సముద్రంలో ఉన్న షిప్ లో విజయ్ ని విలన్స్ బందించగా.. విజయ్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు. విజయ్ చేసిన స్టంట్స్ హాలీవుడ్ యాక్షన్ సినిమాని తలపించాయి. ఆ స్టంట్స్ చూసి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చిన బాయ్ ఆశ్చర్యంగా చూస్తుండగా.. విజయ్ 'థమ్స్ అప్' తీసుకొని తాగి 'సాఫ్ట్ డ్రింక్ కాదు.. ఇది తుఫాన్' అని చెప్తాడు.
విజయ్ 'థమ్స్ అప్' యాడ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ మూవీ ట్రైలర్ చూసినట్లు ఉందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ముందు ముందు మరిన్ని బ్రాండ్స్ విజయ్ వైపు చూసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలో మహేష్ బాబు చేతిలో ఎక్కువ బ్రాండ్స్ ఉన్నాయి. మహేష్ చేస్తున్న బిగ్ బ్రాండ్స్ లో ఒక్కటైన 'థమ్స్ అప్'కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన విజయ్.. ఫ్యూచర్ లో ఎక్కువ యాడ్స్ చేస్తున్న హీరోగా మహేష్ ప్లేస్ లోకి వస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



