`కేజీఎఫ్ః ఛాప్టర్ 2`లో `లైగర్` బ్యూటీ చిందులు!
on Feb 1, 2022

2018 క్రిస్మస్ స్పెషల్ గా రిలీజైన `కేజీఎఫ్ః ఛాప్టర్ 1` ఏ స్థాయిలో బాక్సాఫీస్ ని షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ పిరియడ్ డ్రామాకి సెకండ్ పార్ట్ గా `కేజీఎఫ్ః ఛాప్టర్ 2` రాబోతోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 14న ఈ భారీ బడ్జెట్ మూవీ పలు భారతీయ భాషల్లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `కేజీఎఫ్ః ఛాప్టర్ 1`లో మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన ప్రత్యేక గీతం సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. హిందీలో ఇదే పాటని మౌని రాయ్ పై చిత్రీకరించారు. ఈ రెండు వెర్షన్స్ కూడా ఎంటర్టైన్ చేశాయి. కట్ చేస్తే.. సెకండ్ పార్ట్ లోనూ ఇలాంటి ఓ డాన్స్ నంబర్ ఉందట. అంతేకాదు.. బాలీవుడ్ క్లాసిక్ `షోలే` మూవీలోని ``మెహబూబా.. మెహబూబా..`` అంటూ సాగే పాపులర్ సాంగ్ ని `కేజీఎఫ్ః ఛాప్టర్ 2`లో రీమిక్స్ చేశారట. కాగా, ఈ స్పెషల్ సాంగ్ లో `లైగర్` బ్యూటీ అనన్యా పాండే తన చిందులతో కనువిందు చేయనుందని బజ్. అనన్య నృత్యాలు హిందీకే పరిమితమా? లేదంటే దక్షిణాది వెర్షన్స్ లోనూ ఉంటాయా? అన్నదానిపై క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా.. `కేజీఎఫ్ః ఛాప్టర్ 2`కి అనన్య ప్రత్యేక గీతం కచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. త్వరలోనే `కేజీఎఫ్ః ఛాప్టర్ 2`లో అనన్య ఎంట్రీపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



