`పుష్ప - ద రూల్`కి సుక్కు సమ్మర్ సెంటిమెంట్!
on Jun 15, 2022

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో `పుష్ప - ద రైజ్` (2021) ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సుక్కు తెరకెక్కించిన ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్.. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందిన ఈ పిరియడ్ డ్రామా తాలూకు సెకండ్ పార్ట్ `పుష్ప - ద రూల్` అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2023 వేసవిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉంది సుక్కు అండ్ టీమ్.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. సమ్మర్ సీజన్ లో ఇప్పటివరకు విడుదలైన సుకుమార్ డైరెక్టోరియల్స్ అన్నీ విజయపథంలో పయనించాయి. ఆ వివరాల్లోకి వెళితే.. సుక్కు ఫస్ట్ మూవీ `ఆర్య` 2004 వేసవిలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ బాట పట్టగా.. 2011 మండుటెండల కాలంలో వచ్చిన `100% లవ్` కూడా సక్సెస్ ఫుల్ వెంచర్ గా నిలిచింది. ఇక 2018 సమ్మర్ స్పెషల్ గా వచ్చిన `రంగస్థలం` అయితే సంచలనం సృష్టించింది. మరి.. `ఆర్య`, `100% లవ్`, `రంగస్థలం`లాగే సమ్మర్ లో ఎంటర్టైన్ చేయనున్న `పుష్ప - ద రూల్` కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



