పవన్ కళ్యాణ్ కోసం రాసిన కథ 'గాడ్సే'
on Jun 15, 2022

యంగ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ 'గాడ్సే'. గోపి గణేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'బ్లఫ్ మాస్టర్' తర్వాత సత్యదేవ్-గోపి గణేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడువులై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అవినీతి రాజకీయ వ్యవస్థపై ఓ యువకుడు సాగించిన పోరాటమే 'గాడ్సే' స్టోరీ. ట్రైలర్ లో సత్యదేవ్ పలికిన పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అయితే నిజానికి ఈ కథ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని రాసిందట.
మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ గోపి గణేష్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటి వారందరినీ ప్రతిబింబిస్తూ పోరాటం చేసే వాడే మా 'గాడ్సే'. ఇంటర్ చదివే రోజుల్లో ఒకసారి డ్రామాలో గాడ్సే పాత్ర పోషించిన హీరో.. బొమ్మ గన్ తో గాంధీ పాత్రదారిని కాల్చాల్సి ఉండగా 'నేను కాల్చను' అంటాడు. అలాంటి కుర్రాడు పెద్దయ్యాక రియల్ గన్ తో కొందరిని ఎందుకు చంపాల్సి వచ్చిందనేదే ఈ కథ. నిజానికి ఇది పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని రాసుకున్న కథ. కానీ ఆయనకు చెప్పే అవకాశం రాలేదు. ఆయనకు సినిమా చూపించే ప్రయత్నం చేస్తున్నాం" అని గోపి గణేష్ అన్నారు.
ప్రస్తుతం పవన్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. నిజంగానే ఇలాంటి పవర్ ఫుల్ పొలిటికల్ మూవీ పవన్ చేస్తే బాగుటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



