ఓమ్ రౌత్ ఇంటి దగ్గర స్లిమ్ లుక్‌లో ప్రత్యక్షమైన ప్రభాస్!
on Jun 15, 2022

ప్రస్తుతం ఒక దాని వెంట ఒకటిగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని రూ. 500 కోట్లకు మించిన బడ్జెట్‌తో టి-సిరీస్, రెట్రోఫిల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయోధ్యలో 7 వేల సంవత్సరాల క్రితం జరిగిందిగా చెప్పబడుతున్న రామాయణ గాథ ఆధారంగా తయారవుతున్న ఈ చిత్రంలో శ్రీరామునిగా ప్రభాస్, జానకి (సీత)గా కృతి సనన్, లంకేశ్ (రావణుడు)గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. హిందీతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది.
కాగా, ఈరోజు ముంబైలోని బాంద్రాలో ఉన్న డైరెక్టర్ ఓమ్ రౌత్ ఇంటిని సందర్శించాడు ప్రభాస్. ఈ సందర్భంగా కెమెరా కంటికి చిక్కిన అతని ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఓమ్ రౌత్ గత రాత్రి ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చాడనీ, ఆ నిమిత్తంగా ప్రభాస్ ముంబైకి వెళ్లాడనీ సమాచారం. నిన్న మొన్నటి వరకూ బాగా బరువు పెరిగినట్లుగా కనిపించడం, దాంతో అతనిపై ట్రోలింగ్స్ రావడం మనకు తెలుసు. కానీ ఇప్పుడు స్లిమ్ లుక్‌లో స్టన్నింగ్‌గా కనిపిస్తున్నాడు ప్రభాస్. బ్లాక్ జీన్స్, మెరూన్ షర్ట్‌లో చాలా అందంగా ఉన్నాడు. 'సలార్' కోసం ఫిజిక్ మార్చుకోవాల్సిందిగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చిన సూచన మేరకు బాగా వర్కవుట్స్ చేసి ఫలితం రాబట్టాడు.
సచేత్, పరంపర సంగీతం సమకూరుస్తున్న 'ఆదిపురుష్' మూవీ 2023 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఈలోగా ప్రభాస్ బర్త్‌డే అయిన అక్టోబర్ 23న ట్రైలర్ విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



