పెప్సీ తాగమంటున్న కె.జి.ఎఫ్ స్టార్!
on Jan 27, 2023
శీతల పానీయాలకు జనాలలో మంచి ఇమేజ్ ఉన్న హీరో బ్రాండ్ అంబిషన్ అంబాసిడర్ గా పనిచేస్తే పలు విమర్శలు కూడా వస్తాయి. గతంలో చిరంజీవి థమ్సప్ యాడ్ కు పనిచేసినప్పుడు సామాజిక కార్యకర్తలు దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేపారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ థమ్స్ అప్ కు పోటీగా పెప్సీ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. కానీ పలువురు మేధావుల సూచన మేరకు వీరిద్దరూ ఇకపై అలాంటి యాడ్స్ లో నటించమని దూరం జరిగారు.
ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ లో బ్రాండ్ అంబాసిడర్ గా దూసుకుపోతున్న స్టార్ ఎవరు అంటే మహేష్ బాబు పేరుని చెప్పుకోవాలి. థమ్సప్ తో పాటు ఆయన అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా పనిచేస్తూ ఉంటారు. సినిమాలలోనే కాదు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తూ పెద్ద మొత్తం సంపాదిస్తున్నారు. అయితే చిరంజీవి థమ్సప్ చేసినప్పుడు వచ్చిన వ్యతిరేకత మహేష్ బాబు చేస్తే రాకపోవడం విచిత్రంగానే కనిపిస్తోంది.
ఇక విషయానికి వస్తే కేజీఎఫ్ చాప్టర్ 1 కేజిఎఫ్ చాప్టర్ 2 చిత్రాలతో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ స్టార్ గా ఎదిగిన యష్ తాజాగా పెప్సీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పుకున్నారు. ఈ శీతలపానీయానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసినందుకు భారీ మొత్తాన్ని అందుకున్నాడని సమాచారం. ఇక తెలుగులో అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లు కూడా పలు బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేస్తున్నారు. కాగా యష్ నెక్స్ట్ చిత్రం కె వి ఎన్ ప్రొడక్షన్స్ లో చేస్తున్నట్టు టాక్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
