ఆకట్టుకుంటున్న 'సుగుణ సుందరి' సాంగ్!
on Dec 15, 2022

నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం 'వీర సింహా రెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'జై బాలయ్య' సాంగ్ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి 'సుగుణ సుందరి' అంటూ సాగే రెండో సాంగ్ విడుదలైంది.
తాజాగా విడుదలైన 'సుగుణ సుందరి' లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది. "సీమ కుట్టిందే.. సిట్టి సీమ కుట్టిందే" అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. రామ్ మిరియాల, స్నిగ్ధ శర్మ తమదైన శైలిలో ఈ పాటని ఆలపించి మెప్పించారు. ముఖ్యంగా ఈ లిరికల్ వీడియోలో బాలయ్య లుక్స్, ఆయన వేసిన స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన స్టెప్స్ ని బాలయ్య తన ఎనర్జీతో అదరగొట్టాడు. థమన్ మ్యూజిక్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, బాలయ్య-శృతి స్క్రీన్ ప్రజెన్స్ తో ఓవరాల్ గా 'సుగుణ సుందరి' సాంగ్ మెప్పించేలా ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2023, జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



