వోడ్కా తాగి.. జగన్ బయోపిక్‌పై వర్మ షాకింగ్ కామెంట్స్!
on Dec 15, 2022

రామ్ గోపాల్ వర్మ గన్ ఇప్పుడు ఏపీ రాజకీయాల మీద పేలడానికి సిద్ధంగా ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత పరిస్థితులు.. వాటి వెనుక వ్యూహాల గురించి తీస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు. " నేను తీస్తోంది జగన్ బయోపిక్ కాదు. రాజశేఖర్ రెడ్డి గారు పోయినప్పుడు అసలు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి..ఎవరెవరు ఎలా ఎఫెక్ట్ అయ్యారు. రాజకీయ నాయకులు కావొచ్చు, ఫామిలీ మెంబర్స్ కావొచ్చు ఎవ్వరైనా కూడా ఆ టైములో ఎవరి స్వార్థం కోసం ఎవరెవరు ఎలాంటి వ్యూహాలు పన్నారు అనేది బేసిక్ పాయింట్ గా ఈ మూవీ ఉంటుంది.
జగన్ గారు ఎక్కడ పుట్టారు, ఏ స్కూల్ కి వెళ్లారు అనే విషయాలు ఏవీ ఈ మూవీలో ఉండవు. ‘బీజేపీ÷పీకే x టీడీపీ-లోకేష్+జగన్ = వ్యూహం’ అనే ఈక్వేషన్ గురించి చాలా మంది అడిగారు. ఐతే దాన్ని వోడ్కా తాగి చేశా. అందులో ఉన్న నిగూఢ అర్ధం ఐతే ఇప్పుడు చెప్పను సినిమా చూస్తేనే తెలుస్తుంది. లైఫ్ లో ఏది చేసిన దానికి అదర్ సైడ్ అనేది కచ్చితంగా ఉంటుంది. నేను ఒక సైడ్ తీసుకున్నా..మీరు ఇంకో సైడ్ తీసుకోండి ఎవరు వద్దన్నారు. ఏ సైడ్ తీసుకున్నా జస్టిఫికేషన్ చేశామా లేదా అని చూసుకోవాలి" అని అన్నారు వివాదాల ఆర్జీవీ. ఇక ఈయన మాటలతో ఈ మూవీకి ఇప్పటినుంచే మంచి హైప్ క్రియేట్ అవుతోంది, అలాగే ఈసారి ఎవరెవరిని టార్గెట్ చేశారో చూడాలి అనే ఒక ఆసక్తి ఆడియన్స్ లో మొదలయ్యింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



