'కేశవ' డైరెక్టర్-ప్రొడ్యూసర్ కాంబో రిపీట్!
on Jun 1, 2020
దర్శకుడు సుధీర్ వర్మకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. 'స్వామి రారా' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అతడి మేకింగ్, టేకింగ్ ఇష్టపడే ప్రేక్షకులు పరిశ్రమ ప్రముఖులు ఉన్నారు. అయితే విజయాలే అతడి దరి చేరడం లేదు. 'స్వామిరారా తో అందరినీ మెప్పించిన సుధీర్ వర్మ ఆ తర్వాత ఆ స్థాయి సినిమా చేయలేదు. నాగచైతన్య కథానాయకుడిగా తీసిన 'దోచెయ్' దారుణ పరాజయం చవిచూసింది. తర్వాత నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కించిన 'కేశవ', శర్వానంద్ కథానాయకుడిగా రూపొందించిన 'రణరంగం' ఆశించిన విజయాలు సాధించలేదు.
అయినా... సుధీర్ వర్మ ప్రతిభపై 'కేశవ' చిత్ర నిర్మాత అభిషేక్ నామా నమ్మకం ఉంచారు. అతనితో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. స్టోరీలైన్ లాక్ చేశామని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, మరో వారం పది రోజుల్లో పూర్తి వివరాలు ప్రకటిస్తామని, షూటింగులకు అనుమతులు వస్తే ఆగస్టులో సినిమాను ప్రారంభించాలని అనుకుంటున్నామని అభిషేక్ నామా తెలిపారు.
ఇప్పుడు సుధీర్ వర్మ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి అభిషేక్ నామా నిర్మించబోయే సినిమా అయితే... రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రలలో కొరియన్ హిట్ 'మిడ్ నైట్ రన్నర్స్' తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్ కూడా సుధీర్ వర్మకు వచ్చింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
