సిగాచీ బాధితులకు పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు : హైకోర్టు
posted on Nov 4, 2025 6:28PM

పటాన్‌చెరులోని సిగాచీ కంపెనీ ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 54 మంది మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో ఆలస్యంపై విచారణ జరుగింది. కంపెనీపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బాధితులకు ఇస్తామన్న కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ఏఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ఇప్పటి వరకు రూ. 25 లక్షలు మాత్రమే చెల్లించారని తెలిపింది.
మిగతా పరిహారం ఎప్పుడు అందిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఫ్యాక్టరీ ఎండీకి నోటీసులు జారీ చేసింది. పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 54 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.