అంత జరిగినా..కొంచెం కూడా మారని బన్నీ..!
on Jun 29, 2017
.jpg)
ఒక హీరో సినిమా వేడుకపై మరొక హీరో అభిమానులు రచ్చ చేయడం సరైన పద్ధతి కాదు అంటూ సరైనోడు సక్సెస్‌మీట్‌లో పవన్ ఫ్యాన్స్‌ను ఉద్దేశిస్తూ బన్నీ అన్న "చెప్పను బ్రదర్" డైలాగ్ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఆ ఒక్క మాటతో పవర్‌స్టార్ అభిమానులకు అల్లు అర్జున్ టార్గెట్‌గా నిలిచాడు. దానికి పర్యవసానమే డీజే టీజర్, ట్రైలర్‌లకు డిజ్‌లైక్స్. తాజాగా మరోసారి అచ్చం అలాంటి వివరణే ఇచ్చాడు బన్నీ..ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవి నటించిన జయదేవ్ ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
బన్నీ స్టేజ్ మీదకు ఎక్కి మైక్ పట్టుకోగానే అభిమానులు డీజే, డీజే అంటూ హోరెత్తించారు. కాసేపు ఓపికగా భరించిన అల్లు అర్జున్ ఆ తర్వాత నేను మీకొక సందేశం ఇవ్వాలనుకుంటున్నా అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో పెద్దవారు చెప్పే నాలుగు మంచి మాటలు విని చప్పట్లు కొట్టాలి గానీ..డీజే, డీజే అంటూ అరవడం సంస్కారం కాదు..అలా అరవడానికి వేరే ప్లేస్‌లున్నాయంటూ తన అభిమానులకు చురకలు అంటించాడు. అక్కడ బన్నీ వ్యవహరించిన తీరుపై పలువురు ప్రశంసించాడు. తను తీసుకున్న స్టాండ్‌పై అల్లు అర్జున్ బలంగా నిలబడి ఉన్నారని తాజాగా మరోసారి అర్థమైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



