పవన్ కళ్యాణ్‌ని ఎలా చూపించాలో ఆయనకే తెలుసు?
on Jun 29, 2017

కొన్ని సార్లు రావడం లేట్ అవొచ్చేమో గాని రావటం మాత్రం పక్కా - ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వచ్చిన సినిమాలో చెప్పిన డైలాగ్. ఈ డైలాగ్ కి అసలు పరమార్ధం మనందరికీ తెలిసిందే- అదేంటంటే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి త్వరలో వస్తున్నానని సూచన ప్రాయంగా చెప్పడం. ఈ వార్త కొందరు అభిమానులకి కిక్ ఇస్తే, ఇంకొందరికి నిరాశ కల్పించింది. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్ళాక పవన్ కళ్యాణ్ సినిమాలు పూర్తిగా మానేస్తానని చెప్పాడు. మొత్తానికి పవన్ మహా అయితే, ఇంకో రెండో మూడో సినిమాలు చేసి టాలీవుడ్ కి గుడ్ బయ్ చెప్పనున్నాడు. వరుస ఫ్లాపులు వస్తే ఏ నటుడికయినా ఇబ్బందులు తప్పవు. కానీ ఈ విషయంలో పవన్ కి అలంటి ఇబ్బందులు ఏం లేవు. గతంలో ఆయన నుండి మంచి సినిమా కోసం ఫాన్స్ దాదాపు దశాబ్దం నిరీక్షించారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న చిత్రంతో పవన్ కళ్యాణ్ మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడంటున్నారు ఆయనకీ దగ్గరి వాళ్ళు. పవన్ ని ఎలా చూపించాలో తెలియకపోవడం వల్లే, ఈ మధ్య చిత్రాలు బోల్తా కొట్టాయని. పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తే ఫాన్స్ కి నచ్చుతుందో తెలుసు కాబట్టే త్రివిక్రమ్ పకడ్బందీగా ప్లాన్ చేసాడని అంటున్నారు. స్క్రిప్ట్ దగ్గర్నుండి అన్ని విషయాల్లో ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ ని గత చిత్రాల కన్నా గొప్పగా, ఫాన్స్ మెచ్చే విధంగా చూపించబోతున్నాడని అంటున్నారు. ఇదే గనక నిజమయితే, దీపావళికి పవన్ అభిమానులకి షడ్రుచుల భోజనం గ్యారంటీ!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



