చిరంజీవిని క్రాస్ చేసి సిక్సర్ కొట్టిన నాని..!
on Jun 30, 2017
మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమాను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన మెగాస్టార్ చిరంజీవిని 20 సినిమాలు కూడా చేయని నాని క్రాస్ చేయడం ఏంటి? అనుకుంటున్నారా.! అక్కడికే వస్తున్నా..టైమ్ మిషిన్ ఎక్కేసి సరిగ్గా ఓ 31 సంవత్సరాలు వెనక్కి వెళితే.. అంటే 1986లో అన్నమాట. బాలకృష్ణ తొమ్మిది సినిమాల్లో నటించారు .. దాంట్లో ఏకంగా ఆరు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచి, శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఈ రికార్డ్ ఇప్పటికీ చెక్కుచెదర కుండా అలాగే ఉంది. దటీజ్ బాలయ్య.
బాలయ్య సిక్సర్ కొట్టిన ఆ సినిమాలు ఏంటా అనుకుంటున్నారా! 1. సీతారామ కల్యాణం, 2. ముద్దుల కృష్ణయ్య, 3. దేశోద్దారకుడు, 4. కలియుగ కృష్ణుడు, 5. అనసూయమ్మగారి అల్లుడు, 6.అపూర్వ సహోదరులు.
ఒకే ఏడాది కాకపోయినా.... మన మెగాస్టార్ చిరంజీవి కూడా వరుసగా.. హిట్లర్, మాస్టర్, బావగారూ బాగున్నారా!, చూడాలని ఉంది, స్నేహం కోసం అంటూ... వరుసగా అయిదు హిట్లు ఇచ్చారు. అయితే... ఆరో సినిమా ’ఇద్దరు మిత్రులు‘ ఆయన్ను దెబ్బకొట్టేసింది.
అయితే... నాని మాత్రం .. 1. ఎవడే సుబ్రమణ్యం, 2. భలేభలే మగాడివోయ్, 3. కృష్ణగాడి వీర ప్రేమగాథ, 4. జెంటిల్ మేన్, 5. మజ్ను, 6. నేను లోకల్. అంటూ వరుసగా ఆరు హిట్లు కొట్టేసి ’బాలయ్య తర్వాత నేనే‘ అనిపించాడు. కాకపోతే... ఈ ఫీట్ ని బాలయ్య ఒకే ఏడాదిలో క్రియేట్ చేస్తే.. నానీకి మాత్రం మూడేళ్లు పట్టింది. ఏది ఏమైనా.. నాని గ్రేట్ కదా!