'ssmb 28' షూటింగ్ ఆగిపోయింది.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
on Sep 21, 2022

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు తన 28వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఈ నెల 12న ప్రారంభమైంది. ఫస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ ప్రారంభమైన వారం రోజులకే బ్రేక్ వచ్చింది. దీంతో యాక్షన్ సీన్స్ అనుకున్న స్థాయిలో రావడంలేదన్న అసంతృప్తితో షూటింగ్ వాయిదా వేశారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ 'ssmb 28' షూటింగ్ పై క్లారిటీ ఇచ్చారు.
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని సంస్థ సోషల్ మీడియా వేదికగా షూటింగ్ గురించి క్లారిటీ ఇచ్చింది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో 'ssmb 28' మొదటి షెడ్యూల్ పూర్తయిందని చెప్పింది. అద్భుతంగా స్టంట్ కోరియోగ్రఫీ అందించారంటూ అంబు-అరువు మాస్టర్లకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే దసరా తర్వాత రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని, ఇందులో మహేష్, పూజ హెగ్డే పాల్గొంటారని పేర్కొంది.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పీఎస్ వినోద్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



