'తార్ మార్'.. మెగా జాతర షురూ
on Sep 21, 2022

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గాడ్ ఫాదర్'. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి 'తార్ మార్ తక్కర్ మార్' అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు.
చిరంజీవి, సల్మాన్ కలిసి చిందేసి అలరించనున్న ఈ మాస్ సాంగ్ ఆకట్టుకుంటోంది. తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. దానికి తగ్గట్లే 'బాసులు వచ్చిండ్రే.. బేసులు పెంచుండ్రే.. బాక్సులు బద్దల్రే' అంటూ అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ అందించాడు. ఇక శ్రేయ ఘోషల్ తనదైన సింగింగ్ తో మెస్మరైజ్ చేసింది. ఈ సాంగ్ కి ప్రభుదేవా కొరియోగ్రాఫర్ కావడం విశేషం. ఆయన కొరియోగ్రఫీలో చిరంజీవి, సల్మాన్ కలిసి చిందేస్తే థియేటర్స్ లో మాస్ కి పూనకాలు వస్తాయి అనడంలో సందేహం లేదు. సినిమా విడుదలకి రెండు వారాల ముందే ఈ సాంగ్ తో మెగా ఫ్యాన్స్ కి పండగ మొదలైందని చెప్పొచ్చు.

సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా నిరవ్ షా, ఎడిటర్ గా మార్తాండ్ కె.వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



