నేను 5 వరకే చదువుకున్నా : థమన్
on Jun 21, 2022
థమన్ ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఆయన గురుంచి ఆయన పాటలే చెప్తాయి. అలాంటి తమన్ లో హ్యుమానిటీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువే. తెలుగు ఇండియన్ ఐడల్ లో కంటెస్టెంట్ రేణు కుమార్ కి నిజంగా చాలా గొప్ప సాయం చేశారు. రేణుకుమార్ కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాళ్ళ అబ్బాయికి మూడేళ్ళ పాటు తానె చదివించే బాధ్యతను తీసుకున్నారు థమన్. తాను కేవలం ఐదవ తరగతి వరకే చదువుకున్నాని చెప్పారు. ఆ టైములో నాన్న చనిపోయేసరికి ఇంటి బాధ్యతను నేను తీసుకోవాల్సి వచ్చింది.
ఇక అక్కడితో చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసాను. నీది నాది ఒకటే సిట్యువేషన్.మనలో హ్యుమానిటీ ఉంటె చాలు ఎవరికైనా సాయం చేయొచ్చు అన్నారు థమన్. మనుషుల్ని అర్ధం చేసుకుంటే చాలు, చదువు అక్కర్లేదు అన్నారు..కానీ చదువు నేర్పించడం చాలా ఇంపార్టెంట్ అన్నారు. రేణుకుమర్ బిడ్డ థమన్ చేసిన ఫేవర్ కి థ్యాంక్యూ థమన్ మామ అని చెప్పాడు. మీరు ఎంత నాటీగా, హైపర్ కిడ్ గా ఉన్నా లోపల మాత్రం ఒక ఎమోషనల్ కిడ్ ఉన్నాడని మాకు తెలుసు అంటూ శ్రీరామ్ థమన్ చేసిన మంచి పనికి హ్యాట్సాఫ్ చెప్పాడు. మా అమ్మ చెప్పింది అతనికి సాయం చేయమని, దేవుడు ఆజ్ఞాపించాడు చేసాను అంతే అని తన మనసులో మాట చెప్పాడు థమన్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక రేంజ్ లో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్ ఒకరు.
ఇటీవల ఆయా సర్కారు వారి పాత చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ , ఆర్ సి-15 మూవీస్ కి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. స్టార్ హీరోస్ మూవీస్ అన్నిటికి కూడా ప్రస్తుతం తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. థమన్ ఏ సినిమా చేసినా అది మ్యూజికల్ హిట్ అవడం గ్యారంటీ.. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ అంతా థమన్ నే ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో థమన్ మ్యూజిక్ కి మంచి డిమాండ్ పెరిగింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
