నదియా ఆశలన్నీ రామ్ పైనే!
on Jun 21, 2022
`మిర్చి`, `అత్తారింటికి దారేది`, `దృశ్యం` చిత్రాలతో తెలుగునాట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హ్యాట్రిక్ కొట్టింది ఒకప్పటి కథానాయిక నదియా. అయితే, ఆ తరువాత తను నటించిన తెలుగు సినిమాల్లో `అ ఆ`, `దృశ్యం 2` మినహా పెద్దగా మెరుపులేమీ లేవు. `బ్రూస్ లీ`, `నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా`, `మిస్ ఇండియా`, `వరుడు కావలెను`తో పాటు ఈ సంవత్సరం ప్రథమార్ధంలో జనం ముందు నిలిచిన `గని`, `సర్కారు వారి పాట`, `అంటే.. సుందరానికీ!`.. ఇలా ఏవీ కూడా నదియా కెరీర్ కి అంతగా ప్లస్ కాలేకపోయాయి.
ఈ నేపథ్యంలో.. వచ్చే నెలలో రాబోతున్న తన కొత్త చిత్రంపైనే నదియా ఆశలు పెట్టుకుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన ఆ సినిమానే.. `ద వారియర్`. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ కాప్ డ్రామాలో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్ లో కనిపించబోతోందట నదియా. మరి.. `ద వారియర్`తోనైనా నదియా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే, `ఉప్పెన` భామ కృతి శెట్టి కథానాయికగా నటించిన `ద వారియర్`కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
