జ్యోఅచ్యుతానందపై జక్కన్న ఏమన్నారంటే..!
on Sep 9, 2016

తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన జ్యోఅచ్యుతానంద ఇవాళ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్‌షో చూసొచ్చిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. అలాంటి టైంలో మరో కాంప్లిమెంట్ వారిని మరింత ఖుషీ చేస్తోంది. ఆ కాంప్లిమెంట్ ఇచ్చింది ఎవరో కాదు దర్శకధీరుడు రాజమౌళి. ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్న వారిని వెన్నుతట్టి ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు జక్కన్న. దానిలో భాగంగానే అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జ్యోఅచ్యుతానందను చూసిన రాజమౌళి ఆ సినిమా అద్భుతంగా ఉందంటూ చిత్ర యూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. వారాహి + శ్రీనివాస్ అవసరాల + కళ్యాణ్ రమణ కాంభినేషన్ మరోసారి ప్రేక్షకులకు ఫ్యామిలీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను అందించారని, ఎక్కడ ఓవర్ లేకుండా సినిమా అంతా ఫన్ ఉండేలా, చివరి పది నిముషాలు హృదయానికి హత్తుకునేలా ఉందన్నారు. రాజమౌళి ఒక సినిమాపై పాజిటివ్‌గా మాట్లాడారంటే అది ఖచ్చితంగా సూపర్‌హిట్టనే భావన ఇండస్ట్రీలోనూ..ప్రేక్షకుల్లోనూ ఉంది. ఇప్పుడు జ్యోఅచ్యుతానంద విషయంలో జక్కన్న కాంప్లిమెంట్ ఇవ్వడంతో ఇక ఈ సినిమాకు తిరుగే ఉండదని చిత్రయూనిట్ భావిస్తోంది.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



