సస్పెన్స్‌లో సమంతా, చైతూల పెళ్లి...?
on Sep 9, 2016
.jpg)
నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ సినీ జనాలతో పాటు ప్రేక్షకుల్ని తల బాదుకునేలా చేసిన ఇష్యూ సమంత, నాగచైతన్యల మ్యారేజ్. అనేకసార్లు చెట్టాపట్టాలేసుకుని పబ్లిగ్గా దొరికినా కూడా వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందనేది అర్థం కాలేదు. అయితే స్వయంగా నాగచైతన్య తండ్రి, కింగ్ నాగార్జున వీరి లవ్ మ్యాటర్‌ను బయటపెట్టేశారు. వారిద్దరి ప్రేమ నిజమేనని..వారు హ్యాపీగా ఉన్నారని..పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని చెప్పి వీరి లవ్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఇదే సందర్భంలో మరో ట్విస్ట్ ఇచ్చారు నాగ్. తన రెండో కుమారుడు అఖిల్ నిశ్చయ తాంబూలాల ముహూర్తాన్ని ఫిక్స్ చేసిన కింగ్, చైతూ , సమంతల ముహూర్తం మాత్రం వెల్లడించలేదు. నాగార్జున అలా ఎందుకు చెప్పారో తెలియదు కాని ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని ఫిలింనగర్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. సమంత కొంత కాలం పెళ్లిని వాయిదా వేసే ఆలోచనలో ఉందని, అందుకే నాగ్ ముహూర్తం పెట్టించలేదంటూ చెవులు కొరుక్కుంటున్నారు. పీకల్లోతు ప్రేమలో మునిగిన సమంత పెళ్లి టైం నాటికి సినిమాలను ఆపేస్తుందని ప్రచారం జరిగింది..అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ కొత్త ఆఫర్లకు ఓకే చెబుతుందంటూ ఉదాహరణలు చెబుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



