బాహుబలి 2తో రిస్కులో పడ్డ నాగార్జున
on Sep 9, 2016

బాహుబలి 2 కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టే సామర్థ్యం బాహుబలి 2కే ఉందన్నది అందరి నమ్మకం. బాహుబలి 2 సంచలనాలు సృష్టించడం ఖాయమని ప్రభాస్ అభిమానులే కాదు.. యావత్ సినీ ప్రపంచం నమ్ముతోంది. అందుకే ఈ సినిమా రైట్స్‌ని సొంతం చేసుకొనేందుకు బడా బడా హీరోలు సైతం ప్రయత్నిస్తున్నారు. తాజాగా బాహుబలి 2 కృష్ణా జిల్లా రైట్స్‌ని నాగార్జున కొనుగోలు చేశారు. దాదాపు రూ.8 కోట్ల ధర పలికిందని సమాచారం. మరో నిర్మాత సాయి కొర్రపాటితో కలసి కృష్ణా జిల్లాలో బాహుబలి 2ని పంపిణీ చేయబోతున్నాడు నాగార్జున. టాప్ స్టార్లు, ప్రొడ్యూసర్లు సైతం బాహుబలి పై కన్నేశారంటే అది ఈ సినిమాకున్నక్రేజ్ కి నిదర్శనం. కృష్ణా జిల్లాలో రూ.8 కోట్లకు ఓ సినిమా అమ్ముడుపోవడం ఇదే తొలిసారి. బాహుబలికి ఇక్కడ రూ.7 కోట్ల వసూళ్లు వచ్చాయట. దాన్ని దాటితే తప్ప... పెట్టుబడి రాదు. అంటే.. రిస్క్ ఫ్యాక్టరే కాస్త ఎక్కువగా ఉందన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



