శ్రీకాంత్ డైరెక్షన్ లో బాలయ్య!?
on Feb 1, 2022

రీసెంట్ గా `అఖండ`తో మరో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. త్వరలోనే తన తదుపరి సినిమా పట్టాలెక్కనుంది. `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది. చెన్నై పొన్ను శ్రుతి హాసన్ నాయికగా నటించనున్న ఈ సినిమాని ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్.
కాగా, గోపీచంద్ మలినేని కాంబో మూవీ తరువాత వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా చేయనున్నారు బాలకృష్ణ. అంతేకాదు.. గీతా ఆర్ట్స్ సంస్థలోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తారని, అలాగే విజనరీ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లోనూ సినిమా కమిట్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో ప్రముఖ దర్శకుడికి కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. శ్రీకాంత్ అడ్డాల. `కొత్త బంగారు లోకం`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `నారప్ప` చిత్రాలతో ఆకట్టుకున్న శ్రీకాంత్.. తాజాగా బాలకృష్ణకి ఓ కథ వినిపించారట. అది నచ్చడంతో బాలయ్య వెంటనే ఓకే చెప్పారని సమాచారం. అలాగే, స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఈ సినిమాని నిర్మిస్తారని వినిపిస్తోంది. త్వరలోనే బాలయ్య - శ్రీకాంత్ కాంబో మూవీపై క్లారిటీ రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



