శ్రీదేవితో అల్లరోడు.. కొత్త సినిమా షురూ!
on Feb 1, 2022

గతేడాది 'నాంది' అనే విభిన్న చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న అల్లరి నరేష్ సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం 'సభకు నమస్కారం' అనే సినిమా చేస్తున్న నరేష్.. మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నరేష్ కెరీర్ లో 59వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా తాజాగా లాంఛనంగా ప్రారంభమైంది.
అల్లరి నరేష్ 59వ చిత్రం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజేష్ దండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎ.ఆర్.మోహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇటీవల 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాతో ఆకట్టుకున్న ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. బాలాజీ గుత్త సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బాలు మున్నంగి క్లాప్ కొట్టగా, అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు.

శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



