'ఆక్ పాక్ కరేపాక్'.. 'జాతిరత్నాలు' రేంజ్ లో ఉంటుందా?
on Feb 1, 2022

సినిమా జనాల్లోకి వెళ్లాలంటే ముందుగా ఆ సినిమా టైటిల్ క్యాచీగా, డిఫరెంట్ గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి ఏర్పడుతుంది. ఇప్పుడు ఓ మూవీ టీమ్ తమ సినిమాకి 'ఆక్ పాక్ కరేపాక్' అనే ఫన్నీ టైటిల్ పెట్టి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై గీతా మిన్సాలా నిర్మిస్తున్న 'ఆక్ పాక్ కరేపాక్'కి యుగంధర్ ముని దర్శకత్వం వహించనున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో A (యాడ్ ఇన్ఫినిటమ్) అనే వైవిధ్యభరితమైన సినిమా వచ్చింది. ఆ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో అదే టీమ్ మరో ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమైంది. క్రైమ్ కామెడీ జానర్‌లో తెరకెక్కబోతోన్న ఈ చిత్రానికి 'ఆక్ పాక్ కరేపాక్' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ లుక్ పోస్టర్ ఫన్నీగా, డిఫరెంట్ గా ఉంది. పోస్టర్ లో మూడు కోతులని చూపించారు. 'జాతిరత్నాలు' సినిమాలో లాగా ఈ సినిమాలో కూడా ముగ్గురు యువకుల స్టోరీతో నవ్వులు పూయిస్తారేమో చూడాలి.

నిర్మాత గీతా మిన్సాలా మాట్లాడుతూ.. "ఇంతకుముందు మా బ్యానర్‌లో చేసిన A (యాడ్ ఇన్ఫినిటమ్) చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. క్రైమ్ కామెడీ జానర్‌లో.. రోజువారీ జీవితంలో మనం చూసే ఫన్నీ క్యారెక్టర్స్ సమాహారంగా.. వినోదమే ప్రధానంగా ఈ చిత్రం ఉంటుంది. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాము" అని తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



