శ్రీదేవి చిన్నకూతురు కూడా వచ్చేస్తోంది!
on Jan 19, 2021
.jpg)
దివంగత శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఖుషి తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు. అయితే ఆమె పరిచయ చిత్రాన్ని తాను నిర్మించడం లేదని కూడా ఆయన చెప్పారు. ఇప్పటికే శ్రీదేవి, బోనీ దంపతుల పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ 'ధడక్' మూవీతో హీరోయిన్‌గా పరిచయమై, 'గుంజన్ సక్సేనా'తో ఓటీటీ వీక్షకుల్ని అలరించింది.
ఖుషి ఫిల్మ్ ఎంట్రీకి తాను చొరవ చూపడం గుడ్ ఐడియా కాదని బోనీ చెప్పారు. నటి కావాలనేది ఖుషి కోరికనీ, త్వరలో ఆమె ఎంట్రీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వినిస్తుందనీ తెలిపారు. "ఆమెను నటిగా లాంచ్ చేయడానికి నా దగ్గర వనరులున్నాయి. కానీ ఆమెను వేరేవాళ్లు లాంచ్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే నేనామె తండ్రిని కాబట్టి లాంచ్ చేశాడంటారు. ఓ ఫిల్మ్‌మేకర్‌గా దాన్ని నేను భరించలేను, నటిగా ఆమెకూ అది మంచిది కాదు." అని లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
.jpg)
ఓ పేరు పొందిన నిర్మాత ఆమెను లాంచ్ చేయనున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు. "ఖుషి తన సొంత కాళ్లపై నిలబడాలని నేను ఆశిస్తున్నాను. నేను గౌరవించే, సురక్షితమని భావించే ఓ ఫిల్మ్‌మేకర్ ఆమెను లాంచ్ చేయబోతున్నారు." అని చెప్పారు బోనీ.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



