'ఆదిపురుష్' కోసం మోషన్ కాప్చర్ వర్క్ మొదలైంది!
on Jan 19, 2021

ప్రభాస్ టైటిల్ రోల్ చేయనున్న 'ఆదిపురుష్' మూవీ మోషన్ కాప్చర్ వర్క్ మంగళవారం మొదలైంది. నటుల కదలికలను డిజిటల్‌గా ముందుగా రిక్డార్డ్ చేసి, తర్వాత వాటిని సినిమాలో ఉపయోగించుకొనే ఓ టెక్నిక్ మోషన్ కాప్చర్. 'ఆదిపురుష్' మూవీలో శ్రీరామునిగా ప్రభాస్, రావణాసురునిగా సైఫ్ అలీఖాన్ నటించనున్నారు. భారతీయ సినిమాల్లో ఇప్పటివరకూ వినియోగించని రీతిలో వీఎఫ్ఎక్స్‌ను ఈ సినిమా కోసం వినియోగిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు డైరెక్టర్ ఓమ్ రౌత్ ఇప్పటికే తెలియజేశారు.
ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా డైరెక్టర్ ఓమ్ రౌత్, ఆయన టీమ్ ఫొటోను షేర్ చేసి, "Motion capture begins. Creating the world of #Adipurush" అంటూ దానికి క్యాప్షన్ జోడించాడు. ఫిబ్రవరి 2న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.
ఫారిన్ సినిమాలో ఎక్కువగా కనిపించే మోషన్ కాప్చర్ టెక్నాలజీని ఓమ్ రౌత్, అతని టీమ్ 'ఆదిపురుష్' కోసం వినియోగిస్తున్నారని నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు. "మన ఆడియెన్స్ దగ్గరకు 'ఆదిపురుష్'ను తీసుకు వస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాం" అని ఆయన అన్నారు.
ఈ చిత్రంలో సీతగా ఎవరు నటించనున్నారనే విషయం ఇంకా వెల్లడి కాలేదు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



