నన్ను పెళ్లి చేసుకోవడం నార్మల్ అబ్బాయిల వల్ల కాదు!
on Oct 1, 2022

శ్రీరెడ్డి అనే పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో శ్రీరెడ్డి వీడియోస్ ఏది పెట్టినా ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి. ఐతే శ్రీరెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన పెళ్ళికి సంబంధించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. "పెళ్ళెప్పుడు చేసుకుంటున్నారు ?" అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు "పెళ్లంటే ఇప్పటికి వచ్చి నాకు ఇతను కరెక్ట్ అనే ఒక్క వ్యక్తి కూడా కనిపించలేదు. ప్రపోజ్ చేసి, డేటింగ్ చేసేసి పక్కన పడేద్దామా అన్నట్టే ఉన్నారు కానీ సిన్సియర్ గా సంసారాన్ని నిలబెట్టుకుని పద్ధతిగా కాపురం చేసుకుందాం అనేవాళ్ళు ఎవరూ కనపడలేదు." అని చెప్పింది.
"నేను రివర్స్ లో చెప్తున్నాను అనిపిస్తోంది కదా.. అదేనండి నా ఆటిట్యూడ్ కి, నేను చేసే వీడియోస్ కి, నా గ్లామర్ ఫీల్డ్ కి సంబంధించి నేనో టిపికల్ క్యారెక్టర్ కాబట్టి అర్థం చేసుకుని నన్ను పెళ్లి చేసుకోవడం నార్మల్ అబ్బాయిల వల్ల కాదు. సో.. నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎంతో పెద్ద మనసు, చాలా హై థింకింగ్ ఉండాలి." అని అభిప్రాయపడింది.
"ఐతే నాకు ఇంతవరకు ఎవరు నచ్చలేదా అంటే నాకు అంత పట్టించుకునే టైం లేదు. రేర్ గా పార్టీస్ కి, వాటికి వెళ్ళేటప్పుడు అక్కడ నచ్చేవాళ్ళు కనిపిస్తారు కానీ వాళ్లకు పెళ్లిళ్లయిపోయాయి" అని చెప్పింది శ్రీరెడ్డి.
"మరి ఒంటరిగా ఉండడం బాధగా అనిపించట్లేదా ?" అని అడిగేసరికి "రతన్ టాటా గారే చెప్పారు ఒంటరిగా ఉండడం అనేది పెద్ద జబ్బు అని. కానీ ఒంటరిగా ఉండడం వలన మనల్ని మనం ఇంకా మెరుగుపరుచుకోవచ్చు. స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు.. ఫామిలీ డిప్రెషన్స్ వంటివి అస్సలు ఉండవు. కాబట్టి ఒంటరితనం అనేది ఒక జబ్బు, ఒక భోగం కూడా . 90 పర్సెంట్ ఒంటరిగా ఉండడం నాకు చాలా హ్యాపీ, 10 పర్సెంట్ బాధ" అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది శ్రీరెడ్డి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



