మీ ఇద్దరి మధ్య గొడవ అనేది వస్తే ఇద్దరినీ వదిలేస్తాను...వార్నింగ్ ఇచ్చిన నాగ శౌర్య
on Oct 1, 2022

"ఊహలు గుసగుసలాడే" మూవీతో టాలీవుడ్ కి హీరోగా ఇంట్రడ్యూస్ ఐన నాగ శౌర్య తర్వాత ఎన్నో మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాడు. రీసెంట్ గా కృష్ణ వ్రింద విహారి మూవీ చేసిన నాగ శౌర్య పెళ్లి మీద తన ఒపీనియన్స్ ని ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. "పెళ్లి అంటే ఇదివరకు కాలంలో మా అమ్మలు, బామ్మలు ఎంతో అడ్జస్ట్ ఐపోయి ఏ సమస్యలను బయటికి తెలియనివ్వకుండా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఈ కాలంలో లేడీస్ అంతా చాలా సెన్సిటివ్ అండ్ బోల్డ్. వాళ్లకు ఏది నచ్చితే అది చేస్తున్నారు.
ఒక అమ్మాయి మనల్ని నమ్మి అన్ని వదిలేసి మన ఇంటికి వచ్చినప్పుడు చాలా కేరింగ్ గా చూసుకోవాలి. నేను మా అమ్మకు ఇదే విషయాన్ని చెప్పేసాను ...నీకు, రేపటి రోజున ఇంటికొచ్చే కోడలి మధ్య ఏవన్నా క్లాషెస్ వస్తే నేను భరించలేను..ఇద్దరినీ వదిలేస్తాను అని. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఈ టాపిక్ మీద రోజూ బాధపడుతూనే ఉంటారు. ఇవన్నీ విని విని మా అమ్మకు ముందుగా చెప్పాను అలాగే నన్ను నేను చాలా మౌల్డ్ చేసుకుంటున్నాను . వచ్చిన అమ్మాయితో అడ్జస్ట్ అవ్వాలి కానీ గొడవలు పడితే నేను భరించలేను. సో నేను సెపరేట్ గా ఉంటాను" అంటూ ఈ జనరేషన్ కి బాగా ఉపయోగపడే టిప్ ని చెప్పాడు నాగ శౌర్య.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



