ఏ లోకంలో ఉన్నా.. ఆమెను ప్రేమిస్తూనే ఉంటా
on Feb 25, 2018

అతిలోకసుందరి, బాలీవుడ్ లెజెండరీ నటి శ్రీదేవి మరణం యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను షాక్‌కి గురిచేసింది. శ్రీదేవి ఇక లేరనే వార్తను ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటిది శ్రీదేవిని దేవతగా ఆరాధించే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఆమె మరణ వార్త ఎలా ఉంటుందో కదా..!.. కాంతికన్నా ఎక్కువ ప్రకాశవంతమైనది నేడు మనకు దూరమైందంటూ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన ట్విట్టర్‌లో దేవుణ్ణి ఎప్పుడూ ఇంతలా ద్వేషించలేదంటూ ట్వీట్ చేశారు. లోకం విడిచిపోయిన శ్రీదేవి అంటే తనకు చాలా కోపమన్నారు.. ఆమె ఏ లోకంలో ఉన్నా.. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని తెలిపారు. శ్రీదేవి నిజంగా చనిపోయిందా..? ఎవరైనా నన్ను నిద్రలేపి.. ఇదొక పీడకల అని చెప్పగలరా..? అన్నారు. అందరినీ ఇలా వదిలేసి.. ఆమె ఒంటరిగా ఇలా ఎలా వెళ్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



