అతిలోకసుందరి కన్నుమూత
on Feb 24, 2018

అతిలోక సుందరిగా.. అందాల నటిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినీ నటి శ్రీదేవి ఇకలేరు. ఓ పెళ్లి వేడుక కోసం దుబాయ్‌కి వెళ్లిన ఆమె గుండెపోటుకి గురై అక్కడే కన్నుమూశారు. తొలుత ఆమె మరణించనట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన్పటికీ.. అవన్నీ పుకార్లుగా కొట్టిపారేశారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్లు సంజయ్ కపూర్ ట్వీట్ చేశారు. ఈ వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో ఆమె 200కి పైగా సినిమాల్లో నటించారు.
1963, ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశీలో జన్మించిన శ్రీదేవి.. 1967లో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. పదహారేళ్ల వయసు హీరోయిన్‌గా తొలి సినిమా. 1975-85 మధ్యకాలంలో శ్రీదేవి భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయకగా వెలుగొందారు. 1996 జూన్ 2న బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను ఆమె వివాహాం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జాహ్నావి, ఖుషి. పెళ్లి తర్వాత నటనకు దూరమైన శ్రీదేవి.. 2012లో ఇంగ్లీష్-వింగ్లీష్ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా మామ్ సినిమాతో అందరిని అలరించారు. భారతీయ సినీ పరిశ్రమకు శ్రీదేవి చేసిన సేవలకు గానూ 2013లో ఆమెను పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. శ్రీదేవి మరణం పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



