సాంగ్ టాక్: ఛల్ మోహన్ రంగా
on Feb 24, 2018

లై సినిమా తర్వాత ఇక ఎక్స్‌పరిమెంట్లకు దూరం జరిగి.. తనకు బాగా సూటయ్యే లవ్‌స్టోరీలతోనే కెరీర్ నడిపించాలని స్ట్రాంగ్‌గా ఫిక్సయ్యాడు లవర్ బోయ్ నితిన్. రౌడీ ఫెలో ఫేం చైతన్య కృష్ణ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న సినిమా "ఛల్ మోహన్ రంగా".. త్రివిక్రమ్ కథ అందిస్తుండటం.. పవన్ కళ్యాణ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో ఈ మూవీపై బజ్ బాగానే ఉంది. రీసెంట్‌గా టీజర్‌తో అలరించిన నితిన్ ఇప్పుడు ఈ సినిమాలోని మొదటి సాంగ్‌ను రిలీజ్ చేశాడు.
"గా.. ఘా.. మేఘా" అంటూ క్యూట్ లిరిక్స్‌తో వచ్చే ఈ పాట మెలోడీ ట్యూనింగ్‌తో అదిరిపోయింది. ఫ్రెష్ మ్యూజిక్‌తో ఇరగదీస్తోన్న థమన్ మరోసారి తన మ్యాజిక్‌ను ఈ మూవీలోనూ కంటిన్యూ చేసినట్లు అర్థమవుతుంది. నితిన్‌కు జోడిగా మేఘా ఆకాశ్ నటిస్తోన్న ఈ సినిమాను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న ఛల్ మోహన్ రంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



