విజయ్ దేవరకొండ ‘లైగర్’ నష్టాలను పూడ్చాడా?
on Sep 6, 2022

విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన 'లైగర్' మూవీ ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. విపరీతమైన క్రేజ్, హైప్ రావడంతో మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చాయి. తర్వాత నెగెటివ్ టాక్‌తో షోకి షోకి కలెక్షన్లు దారుణంగా పడిపోయి, ఇటు విజయ్, అటు పూరి జగన్నాథ్ కెరీర్లలో భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.
దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పీకల్లోతు నష్టాల్లో మునిగిపోయారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. నిర్మాతలైన పూరి జగన్నాథ్, చార్మి వారికి పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ కూడా తన రెమ్యూనరేషన్ నుండి సుమారు ఆరు కోట్ల వరకు తిరిగి ఇచ్చేసేందుకు ముందుకు వచ్చాడనీ ఓ రూమర్ బయలుదేరి, వైరల్‌గా మారింది. అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదనీ, అదంతా కేవలం వదంతి మాత్రమేననీ తెలియవచ్చింది.
ఈ సినిమా కోసం విజయ్ చాలా కష్టపడ్డాడు. విడుదలకు ముందు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటినీ చుట్టాడు. ఈవెంట్లలో పాల్గొని, మీడియాతో, ఆడియెన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు. హిందీలో ఈ మూవీని కరణ్ జోహార్ నిర్మించారు. పాన్ ఇండియా ఫిల్మ్‌గా రిలీజైన 'లైగర్'.. అన్ని భాషల్లోనూ డిజాస్టర్ అయ్యి, అందరికీ బిగ్ షాకిచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



