సమంత అనారోగ్యంతో బాధపడుతుందా?
on Sep 6, 2022

గత కొన్ని రోజులుగా నటి సమంత అనారోగ్యంతో బాధపడుతోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే సమంత కొన్ని రోజులుగా దానికి దూరంగా ఉంటూంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఒంట్లో సరిగా లేదనే ప్రచారం బయటకు వచ్చింది. దీంతో చాలా మందిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ఆమె అనారోగ్యంతో బాధపడుతోందా లేక వ్యక్తిగత జీవితంలో ఒత్తిడికి లోనవుతోందా అన్నది ఒక ప్రశ్నగా మారింది.
మీడియాలో సమంత అనారోగ్యం గురించి జరుగుతున్న ప్రచారం గురించి సమంత మేనేజర్ ని తెలుగువన్ ప్రశ్నించగా, "అవన్నీ గాలి కబుర్లు.. కావాలని ఎవరో పుట్టించినవి" అంటూ కొట్టిపారేశాడు. "నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు రూమర్స్ పుట్టించినవారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటాం" అని కూడా హెచ్చరించాడు. అయితే సోషల్ మీడియాలో సమంత ఇదివరకటిలా ఎందుకు యాక్టివ్‌గా లేదనే ప్రశ్నకు సమాధానం లభించలేదు.
ఇక సమంత టైటిల్ రోల్ పోషించిన 'యశోద' మూవీతో పాటు, గుణశేఖర్ డైరెక్షన్‌లో చేసిన 'శాకుంతలం' సినిమా విడుదలకు రెడీ అవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



