'కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్'లో టాలీవుడ్ స్టార్స్ కి అరుదైన గౌరవం
on May 19, 2022
ఫ్రాన్స్ లో జరుగుతున్న 75వ 'కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్'లో టాలీవుడ్ స్టార్స్ కి అరుదైన గౌరవం దక్కింది. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గేలరీలో చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్ ఫోటోలకు స్థానం లభించింది.
మే 17న ప్రారంభమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 28 వరకు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో స్టార్స్ సందడి చేస్తున్న ఈ వేడుకలో ఇండియా నుంచి కూడా పలువురు స్టార్స్ మెరుస్తుండటం విశేషం. అయితే ఈ వేడుకలో చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్ లకు అరుదైన గౌరవం దక్కింది. అక్కడ ఏర్పాటు చేసిన స్టార్ల ఫోటో గేలరీలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున వీరి ముగ్గురి ఫోటోలు కూడా ప్రదర్శించారు. టాలీవుడ్ నుంచి ఈ ముగ్గురు స్టార్ల ఫోటోలు మాత్రమే అక్కడ చోటు దక్కించుకున్నాయి.
చిరంజీవి ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు. ఒకానొక టైమ్ లో ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకొని.. 'బిగ్గర్ దాన్ బచ్చన్' అనిపించుకున్నాడు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన చిరంజీవికి ఈ అరుదైన గౌరవం దక్కడంతో ఆశ్చర్యం లేదు. ఇక రాజమౌళి, ప్రభాస్ విషయానికొస్తే 'బాహుబలి'తో వీళ్ళు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇండియన్ సినిమా ప్రస్తావన వస్తే ఖచ్చితంగా వీళ్లిద్దరి పేర్లు వినిపిస్తాయి. అందుకే ఇప్పుడు ఆ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
