'సర్కారు వారి పాట'కు 100 కోట్ల షేర్ వచ్చిందా లేదా?
on May 19, 2022
'సర్కారు వారి పాట' కలెక్షన్స్ విషయంలో మేకర్స్ చెబుతున్నది ఒకలా ఉంటే.. ట్రేడ్ వర్గాల లెక్కలు మరోలా ఉంటున్నాయి. ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా షేర్ రాబట్టిందని మేకర్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ మూవీ వారం రోజుల్లో వంద కోట్ల లోపే షేర్ వసూలు చేసిందని చెబుతున్నాయి.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఏడో రోజు 'సర్కారు వారి పాట' తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 1.82 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో మొదటి వారం పూర్తయ్యే సరికి తెలుగు రాష్ట్రాల్లో 78.90 కోట్ల షేర్(116 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. తెలుగు స్టేట్స్ లో 97.50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా 80 శాతం రికవరీ సాధించింది. వారం రోజుల్లో ఈ సినిమా నైజాంలో 29.90 కోట్ల షేర్(36 కోట్ల బిజినెస్), సీడెడ్ లో 9.95 కోట్ల షేర్(13 కోట్ల బిజినెస్), ఆంధ్రాలో 39.05 కోట్ల షేర్(48.50 కోట్ల బిజినెస్) కలెక్ట్ చేసింది.
వరల్డ్ వైడ్ గా ఏడో రోజు 2.02 కోట్ల షేర్ వసూలు చేసిన 'సర్కారు వారి పాట' ఇప్పటిదాకా 96.04 కోట్ల షేర్(151.75 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఓవరాల్ గా 120 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి ఇంకా 24 కోట్ల దూరంలో ఉంది. బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి హిట్ గా నిలవాలంటే ఈ వీకెండ్ లో సత్తా చాటాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, ఒకవైపు మేకర్స్ ఈ సినిమా ఐదు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా షేర్ రాబట్టిందని చెబుతుంటే.. మరోవైపు ట్రేడ్ వర్గాలు మాత్రం ఏడు రోజుల్లో 96 కోట్ల షేర్ రాబట్టిందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రొడ్యూసర్స్ ప్రకటించిన కలెక్షన్స్ నిజమని ఫ్యాన్స్ చెబుతుంటే.. అవి తప్పు అని యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో 'సర్కారు వారి పాట' కలెక్షన్స్ పై గందరగోళం నెలకొంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
