హన్సిక గొప్ప మనసు.. పెళ్లికి ప్రత్యేక ఆహ్వానితులు వీరే!
on Dec 4, 2022
సెలబ్రిటీల వివాహాలకు సామాన్యులకు ఆహ్వానం అనేది చాలా అరుదు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులే సెలబ్రిటీల వేడుకల్లో దర్శనమిస్తుంటారు. అయితే హీరోయిన్ హన్సిక మాత్రం తన పెళ్ళికి పేద చిన్నారులను ఆహ్వానించి అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది.
నేడు హన్సిక పెళ్లి. ప్రియుడు సోహైల్ తో ఆమె వివాహ బంధంలోకి అడుగు పెడుతోంది. ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కావడంలో ఎలాంటి ఆశ్చర్యంలేదు. అయితే హన్సిక మాత్రం కొందరు పేద చిన్నారులను ప్రత్యేకంగా అహ్వాహించింది. పలు ఎన్జీవోలతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే హన్సిక.. ఎన్జీవోల ద్వారా నిరుపేద చిన్నారులను అహ్వాహించింది. ఆ పిల్లలు ఎంతో సంతోషంగా హన్సిక వివాహ వేడుకకు బయల్దేరారు. ప్రస్తుతం ఈ చిన్నారులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హన్సిక మంచి మనసుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.