బాలయ్య మెచ్చిన 'హిట్-2'
on Dec 4, 2022

అడివి శేష్ ప్రధాన పాత్రధారిగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హిట్-2'. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ వీక్షించడం విశేషం.

తన కుమారుడు మోక్షజ్ఞతో కలిసి 'హిట్-2' ప్రత్యేక షోని చూసిన బాలకృష్ణ.. మూవీ టీమ్ ని అభినందించారు. బాలకృష్ణ గారికి సినిమా సూపర్ గా నచ్చింది అంటూ శేష్ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. శైలేష్ విజన్, తన పర్ఫామెన్స్ ని మెచ్చుకున్నారని తెలిపాడు. బాలకృష్ణ గారిని హిట్ యూనివర్స్ లో కనిపించాలని అడగగా.. ఆయన స్మైల్ ఇచ్చారని చెప్పాడు. అలాగే మోక్షజ్ఞకి కూడా తమ సినిమా ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా శేష్ షేర్ చేసిన ఫోటోలలో శేష్ తో పాటు బాలయ్య, మోక్షజ్ఞ, నాని, శైలేష్ ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



