క్రేజీ ప్రాజెక్ట్ లో కీర్తి సురేష్
on Dec 4, 2022

'కేజీఎఫ్', 'కాంతార' చిత్రాలతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ప్రస్తుతం తెలుగులో 'సలార్'తో పాటు కన్నడ, మలయాళ భాషల్లో పలు ఆసక్తికర చిత్రాలను నిర్మిస్తోంది. ఇప్పుడు ఈ సంస్థ తమిళ్ పరిశ్రమలోకి అడుగుపెడుతోంది.
కీర్తి సురేష్ ప్రధాన పాత్రధారిగా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ ఓ తమిళ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'రఘు తాత' పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ రైటర్ సుమన్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. సీన్ రోల్డాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా యామిని యజ్ఞమూర్తి, ఎడిటర్ గా సురేష్ వ్యవహరించన్నారు.

ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో 'దసరా', 'భోళా శంకర్' వంటి తెలుగు సినిమాలతో పాటు 'మామన్నన్', 'సైరన్' వంటి తమిళ్ సినిమాలు ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



