రెండో పెళ్లి గురించి మాట్లాడిన సోనీ అగర్వాల్
on Jan 28, 2023
తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాలను రెగ్యులర్‌గా చూసే ప్రేక్షకులకు ఎవరికైనా సరే... సోనీ అగర్వాల్ ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధనుష్ అన్నయ్య, ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవని పెళ్లి చేసుకున్నారు సోనీ అగర్వాల్. ఆయన దర్శకత్వంలో నటించిన 7/ జి బృందావని కాలనీ ఆమె కెరీర్‌లో సూపర్‌డూపర్ హిట్. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వారి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత సెల్వరాఘవన్, సోనీ పెళ్లి చేసుకున్నారు. కానీ అభిప్రాయబేధాల కారణంగా వారిద్దరు విడిపోయారు. ఆ తర్వాత సెల్వరాఘవన్ రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ సోని అగర్వాల్ మాత్రం సింగిల్‌గా ఉంటున్నారు. కెరీర్ మీద దృష్టి పెట్టి వరుసగా ప్రాజెక్టులు చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్‌గా ఆమె డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫాల్ అనే వెబ్ సిరీస్ కూడా చేశారు.
ఫాల్ వెబ్ సిరీస్ లో నటించడం గురించి సోని అగర్వాల్ మాట్లాడుతూ ``ఇందులో నేను ఓ ఇల్లాలి క్యారెక్టర్ చేస్తున్నాను. బిడ్డకు తల్లిగా నటిస్తున్నాను. వెబ్ సిరీస్ నాకు చాలా కొత్తగా అనిపించింది`` అని అన్నారు. రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ ``మీ అందరిలాగా నేను కూడా అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకెన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉంటానో నాకు తెలియదు. సరైన వ్యక్తి సరైన టైంలో గనక కలిస్తే తప్పకుండా నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను`` అని అన్నారు. దీని బట్టి సెకండ్ మ్యారేజ్ మీద సోని అగర్వాల్ సిగ్నల్స్ గట్టిగానే ఇచ్చేసారు అంటున్నారు కోలీవుడ్ జనాలు.
ఇటీవల నరేష్‌తో కొత్త జీవితం మొదలుపెట్టనున్నట్టు ప్రకటించారు పవిత్రా లోకేష్. రెండో పెళ్లి సరైన సమయంలో జరిగి ఉంటే బావుండేదని తన గురించి ఇటీవల చెప్పుకొచ్చారు నటి ప్రగతి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
