డైరక్టర్‌తో ఎలాంటి గొడవలూ లేవంటున్న హీరో
on Nov 8, 2022

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏం గొడవలు జరిగినా బయటకు రావడానికి కాస్త సమయం పట్టేది. అలా అట కదా, ఇలా అట కదా అంటూ అక్కడా ఇక్కడా వినిపించి, తర్వాత ఏ కాస్తో బయటకు వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అలా జస్ట్ ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నా సరే, వెంటనే టర్మ్స్ బాలేవంటూ వార్తలు వైరల్ అయిపోతున్నాయి. రీసెంట్‌గా శివకార్తికేయన్ కూడా ఇలాంటి వైరల్ న్యూస్‌ని ఫేస్ చేశారు.కోవిడ్ టైమ్స్ లోనూ వంద కోట్ల మార్కును టచ్ చేసిన హీరో శివ కార్తికేయన్. చూడ్డానికి పక్కింటబ్బాయిలా ఉండటం, కిడ్స్ కీ, యూత్‌కీ నచ్చే సినిమాలు, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను సెలక్ట్ చేసుకోవడంతో శివకార్తికేయన్‌కి అన్ని కోట్ల వసూళ్లు వచ్చాయి. లాస్ట్ మూవీ అనుకున్నంతగా ఆడకపోయినా, ఫర్లేదంటూ నెక్స్ట్ సినిమా మూడ్‌లోకి షిఫ్ట్ అయ్యారు శివ కార్తికేయన్.
అయితే ఆయన హీరోగా తెరకెక్కుతున్న మావీరన్ సినిమా ఆగిపోయిందంటూ కోడంబాక్కం మొత్తం కోడై కూసింది. దర్శకుడు మడోన్ అశ్విన్‌తో పడకపోవడంతో శివకార్తికేయన్ షూటింగ్‌ని నిలిపేశారని కూడా అన్నారు. అయితే అందులో నిజం లేదని తేల్చిపారేసింది యూనిట్. చెన్నైలో వర్షాల కారణంగా కాస్త షెడ్యూల్ హాల్ట్ అయినంత మాత్రాన ఇలా కథలు అల్లడం కరెక్ట్ కాదంటున్నారు. సోమవారం నుంచే సినిమా పనులు మొదలయ్యాయని అన్నారు. మడోన్ అశ్విన్ చేసిన మండేలా సినిమా నచ్చే శివకార్తికేయన్ అవకాశం ఇచ్చారు. అలాంటప్పుడు వారిద్దరి మధ్య ఎందుకు మనస్పర్థలు వస్తాయి? రూమర్లు క్రియేట్ చేసినా అర్థం పర్థం ఉండాలంటున్నారు యూనిట్ మెంబర్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



