ఇప్పుడు రజనీ నటిస్తున్నది 20వ సినిమా... లెక్కేంటంటే..!
on Nov 8, 2022

తాను డైరక్ట్ చేస్తున్న సినిమాలో తన తండ్రి రజనీకాంత్ కీ రోల్ చేస్తున్నారని ఇటీవల ఐశ్వర్యరజనీకాంత్ అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. అది రజనీకి 20వ సినిమా. అదేంటి? రజనీకాంత్ కెరీర్ ఎర్లీ స్టేజెస్‌లోనే ఈ నెంబర్ క్రాస్ చేసేశారు కదా అని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ఐశ్వర్య డైరక్షన్‌లో రజనీకాంత్ 20వ సినిమా చేస్తున్నారనడానికి ఓ బెస్ట్ లాజిక్ ఉంది. ఆయన కెరీర్ మొత్తం మీద ఆయన చేస్తున్న 20వ సినిమా కాదు, గెస్ట్ యాక్టర్‌గా ఆయన కీ రోల్ చేస్తున్న 20వ సినిమా ఇది. చివరిగా ఆయన గెస్ట్ రోల్ చేసిన సినిమా రావన్.
ఈ మూవీ రిలీజ్ అయి ఇప్పటికి 11 ఏళ్లవుతోంది. ఇప్పుడు కూతురు అడిగిందని ఆమె డైరక్షన్‌లో సినిమా చేయడానికి ఓకే చేశారు. ఆల్రెడీ ఆయన పావత్తిన్ సంబళం, తాయిల్లామల్ నానిల్లై, నక్షత్రం, నండ్రి మీండుం వరుగ, అగ్ని సాక్షి, ఉరువంగల్ మారలాం, యార్, కోడై మళై, మనదిల్ ఉరుది వేండుం, పెరియ ఇడత్తు పిళ్లై, వళ్లిలో గెస్ట్ గా నటించారు. వీటిలో చాలా సినిమాల్లో రజనీ తన రియల్ లైఫ్ కేరక్టర్‌లోనే కనిపించారు. ప్రస్తుతం ఆయన జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత వరుసగా లైకా సంస్థలో సినిమాలు చేయడానికి యాక్సెప్ట్ చేశారు. ఒకప్పుడు స్టార్ డైరక్టర్లతో సినిమాలు చేసిన రజనీకాంత్, ఇప్పుడు తన ఫ్యాన్సే స్టార్ డైరక్టర్లుగా మారి సినిమాలు చేస్తుండటం ఆనందంగా ఉందని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



