ఏషియన్ ఫిలిమ్స్‌కు 'సీతారామం' తెలంగాణ హక్కులు
on Jul 13, 2022

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా హను రాఘవపూడి రూపొందింస్తోన్న 'సీతారామం' మూవీ ఆగస్ట్ 5న థియేటర్లలో విడుదలవుతోంది. బాలీవుడ్ తార మృణాల్ ఠాకుర్ హీరోయిన్‌గా తెలుగుతెరకు పరిచయమవుతోన్న ఈ లవ్ డ్రామాలో రష్మికా మందన్న ఓ స్పెషల్ రోల్‌లో అలరించనుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్, సాంగ్ ఇంప్రెసివ్‌గా అనిపించాయి. ఆర్మీ మనిషిగా దుల్కర్ నటించిన ఈ మూవీలో, అతని ప్రేయసిగా మృణాల్ కనిపించనుంది. రష్మిక ఓ ముస్లిం అమ్మాయి పాత్రను చేసినట్లు రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ తెలియజేసింది.
కాగా ఈ సినిమా తెలంగాణ (నైజాం) ఏరియా హక్కుల్ని ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ చేజిక్కించుకున్నాడు. దీని కోసం ఆయన ఎంత చెల్లించారనే విషయం ఇంకా బయటకు రాలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను రూ. 3 కోట్లకు రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ డీల్ క్లోజ్ చేసింది. యు.ఎస్., ఆస్ట్రేలియా, కెనడాలలో ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా నిర్మిస్తున్న 'సీతారామం' మూవీలో బ్రిగేడియర్ విష్ణుశర్మ పాత్రను సుమంత్ చేయగా, గౌతమ్ మీనన్, ప్రకాశ్‌రాజ్, తరుణ్ భాస్కర్, భూమికా చావ్లా కీలక పాత్రలు చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



