బాలీవుడ్ ని ఇంటర్వ్యూ చేసిన టాలీవుడ్
on Jul 13, 2022

అలేఖ్య హారిక అలియాస్ దేత్తడి హారిక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా చేసొచ్చిన క్యూట్ గర్ల్. ఈమె ఒక సోషల్ మీడియా స్టార్. యూట్యూబ్ వీడియోస్ చేస్తూ, మస్త్ ఫోటో షూట్స్ చేస్తూ నెటిజన్స్ తో వాటిని షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు హారిక ముంబై వెళ్లి రణబీర్ కపూర్ ని కలిసి ఆయనతో దిగిన ఫోటో ఒకటి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. హారిక రణబీర్ ని ఇంటర్వ్యూ చేసిన ఫొటోస్ ని తన స్టోరీ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. "ఎట్టకేలకు రణబీర్ ని కలిసాను. మొదటిసారి పర్సనల్ గా కలిసి ఎన్నో కబుర్లు చెప్పాను.
టాలీవుడ్ లో నా గురించి బాలీవుడ్ లోని రణబీర్ తో చెప్పడం సంతోషంగా ఉంది " ఇలా చెప్తూ హారిక రిలీజ్ చేసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలోని నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇక నెటిజన్స్ కూడా హార్ట్ సింబల్స్ ని, ఫైర్ ఎమోజిస్ ని కామెంట్స్ గా పెట్టారు. రణబీర్ కపూర్ అలియాభట్ కలిసి నటించిన మూవీ ప్రొమోషన్స్ కోసం రణబీర్ ఆల్రెడీ తన జర్నీ ని స్టార్ట్ చేసేసాడు. ఇక హారిక గురించి చెప్పాలంటే తెలంగాణ యాసలో, భాషలో మాట్లాడుతో పేరు తెచ్చుకుంది. మాస్ లుక్ తో తనకంటూ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. అలాగే ఆహాలో "సర్కార్" అనే గేమ్ షోకి హాజరై తన ఫాన్స్ ని ఖుషీ చేసేసింది. బుల్లి తెర పై అవకాశం వచ్చినప్పుడల్లా ఇలా మెరుస్తూ అందరినీ అలరిస్తోంది హారిక.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



