సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతానంటున్న సిరివెన్నెల!
on Jun 4, 2020

ప్రఖ్యాత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. ఐదేళ్ల క్రితమే ట్విట్టర్ అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో అడుగుపెట్టినప్పటికీ, ఆయన అందులో ఇంతకాలమూ యాక్టివ్‌గా లేరు. 2015 సెప్టెంబర్‌లో ట్విట్టర్ అకౌంట్‌ను స్టార్ట్ చేసిన ఆయన ఏవో రెండు ట్వీట్లు వేసి, ఆగిపోయారు. ఇటీవల త్రివిక్రమ్ మూవీ 'అల వైకుంఠపురములో' రాసిన 'సామజవరగమన' సాంగ్‌తో నేటి తరం గీత రచయితలకూ తాను పోటీదారుడినేనని ఆయన చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఆయనకు సోషల్ మీడియాలో తన భావాలను వ్యక్తం చేస్తూ, నెటిజన్లతో ఇంటరాక్ట్ అవ్వాలనే కోరిక పుట్టింది. అందుకే గురువారం ఒక వీడియో సందేశాన్ని ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.
"సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ అవుదామనే కోరిక కలిగింది. నా భావాలను మీతో పంచుకోవడం, రోజువారీ కార్యక్రమాల్లోనూ, నా ఇతరేతర సాహితీ వ్యాసంగాల్లోనూ నా అభిప్రాయాలను నీకు తెలియజేయడం, మీ అభిప్రాయాలను నేను తెలుసుకోవడం, మీకు మరింత సన్నిహితంగా రావాలనే ఉద్దేశంతోటి ఇదివరకిటికన్నా కాస్త చురుగ్గా సోషల్ మీడియాలో ఉందామనే కోరికతో ప్రారంభం చేస్తున్నాను" అంటూ ఆ వీడియో సందేశంలో ఆయన తెలిపారు. Sirivennela Official @sirivennela1955 అనేది ఆయన ట్విట్టర్ ఐడీ. ఇక నుంచీ ఆయన భావాలు, ఆయన ప్రతిభాసంపత్తిని మనం నేరుగా ఆస్వాదించవచ్చన్న మాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



