తెలుగులోకి రష్మిక కాంట్రవర్షియల్ సాంగ్ 'కరాబు'
on Jun 4, 2020
తెలుగులో కథానాయికగా స్టార్ స్టేటస్ అందుకున్న కన్నడ కుట్టి రష్మిక మాతృభాషలో నటిస్తున్న సినిమాలలో 'పొగరు' ఒకటి. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ బంధువు ధ్రువ సర్జా హీరో. ఈ సినిమా ఒక పాట మహిళా సంఘాలు మండిపడేలా చేసింది. చాలా వివాదాస్పదమైంది. అదే 'కరాబు మాస్ కరాబు'. ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధించే అబ్బాయిలకు వత్తాసు పలికే ఈ పాట ఉందని పలువురు విమర్శించారు. వివాదాలు విమర్శలు పక్కన పెడితే యూట్యూబ్ లో ఈ పాట సెన్సేషన్ అయింది. ఇప్పటికే 30 మిలియన్ల మంది వీక్షించారు. ఇప్పుడీ పాట తెలుగులోకి వస్తోంది.
తెలుగునాట రష్మిక కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం, పాట పాపులర్ కావడంతో తెలుగులోనూ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. అందుకని, ముందుగా 'కరాబు' సాంగ్ తెలుగు వెర్షన్ విడుదల చేయడానికి రెడీ అయ్యారు. భాస్కరభట్ల రవికుమార్ తెలుగు లిరిక్స్ రాశారని తెలిసింది. కన్నడలో ఈ పాటను సంగీత దర్శకుడు చందన్ శెట్టి స్వయంగా రాసి పాడారు. అయితే తెలుగులో అనురాగ్ కులకర్ణి పాడాడు.