హీరోగా సింగర్ సునీత కుమారుడు ఆకాష్ ఎంట్రీ...షూటింగ్ ప్రారంభం
on Jan 27, 2023
సింగర్ సునీత కల కొద్ది రోజుల్లో నిజం కాబోతోంది. ఎందుకు అంటే ఆమె కూతురు సింగర్‌గా సక్సెస్ అందుకోవడానికి ట్రై చేస్తుంటే ఆమె కొడుకు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.
ఇక ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ పనులు మొదలయ్యాయి. "సర్కారు నౌకరి" మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు సింగర్ సునీత సుపుత్రుడు ఆకాష్. ఆర్కేటెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గంగనమోని శేఖర్ డైరెక్షన్ లో ఈ మూవీ రాబోతోంది. ఆకాశ్‌కు జోడిగా భావనా వళపండల్ నటిస్తోంది. ఈమెకు హీరోయిన్గా ఇదే ఫస్ట్ మూవీ. ఈ మూవీలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్ వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఫారెన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆకాశ్.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసుకుని యాక్టింగ్ లో కూడా ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు రంగంలోకి దిగాడు. ఆకాష్ ఇంకా యాక్టర్ కాకుండానే ఇన్స్టాగ్రామ్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించేసాడు. తనకు ఎంతో ఇష్టమైన సింగింగ్, డాన్సింగ్ టాలెంట్ ని చూపిస్తూ వాటికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వస్తున్నాడు. త్వరలోనే వెండితెరపై యాక్టింగ్ టాలెంట్‌ను కూడా చూపించేయబోతున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
