మొదలైన నాని దసరా హడావుడి!
on Jan 27, 2023
నాని తొలిసారిగా దసరా మూవీతో పాన్ ఇండియా రేసులోకి వస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర పేరు ధరణి. సుకుమార్ ప్రియ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో నాని దసరా మూవీ తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సినిమాపై నాని చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. మొదటిసారి ఫుల్ మాస్ లుక్ లోకి మేకవర్ అయ్యారు. మరో పుష్పరాజు లాగా కనిపిస్తున్నారు. అయితే పుష్పరాజ్ లేకపోతే చిట్టిబాబు అనే రేంజ్ లో ఉన్నారు. ఈ మూవీ నాని కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ చిత్రానికి గాను నిర్మాతలు 70 కోట్ల వరకు పెట్టుబడి పెడుతున్నారని సమాచారం.
ఇందులో నానికి జోడిగా కీర్తి సురేష్ నటించింది. సముద్రఖని, సాయికుమార్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. సరికొత్త కథాంశంతో నాని వంటి స్టార్ తో నూతన దర్శకునితో ఇంత భారీ బడ్జెట్ తో చిత్రం తీయడం అంటే అది పెద్ద ప్రయోగమే అని చెప్పాలి. శ్యాం సింగరాయ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మిగిలిన సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు నిర్మాతగా హిట్ ఫ్రాంచైజీని నాని నిర్మిస్తున్నారు. గత ఏడాది హిట్ 2 తో సూపర్ హిట్ కొట్టారు. ఈ చిత్రం ఫ్రాంచైజీ లో పార్ట్ 3 లో ఆయనే హీరోగా నటించనున్నారు.
ఇక దసరా చిత్రం మార్చి 30న విడుదలకు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. దసరా లుక్ నుంచి నాని బయటకు వచ్చి కూడా చాలా రోజులు అవుతోంది. క్లీన్ షేవ్ చేసుకొని మామూలుగా మారిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ పై నాని దృష్టి పెట్టబోతున్నారు. ఈ నెలాఖరు నుంచే ప్రమోషన్స్ ని ప్రారంభించనున్నారు. ఇంకా రెండున్నర నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే ప్రమోషన్స్ జోరు పెంచాలని దేశవ్యాప్తంగా మరీ ముఖ్యం తమిళనాడు, నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ వేగం పెంచాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ప్రమోషన్స్ లో నానీతో పాటు కీర్తి సురేష్ కూడా పాల్గొననుందని సమాచారం. కీర్తి సురేష్ కు కూడా నటిగా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ కోసం ఎదురుచూస్తోంది. బహుశా నాని -కీర్తి సురేష్ ల ఇద్దరి కోరికలు దసరా ద్వారా నెరవేరుతాయేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
