‘జైలర్’కు గుమ్మడికాయ కొట్టేశారు!
on Jan 27, 2023
వాస్తవానికి సూపర్ స్టార్ రజినీకాంత్ కు రోబో చిత్రం తర్వాత సరైన హిట్టు రాలేదని చెప్పాలి. తాజాగా ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా పూర్తి చేసి తాజాగా గుమ్మడికాయ కూడా కొట్టేశారు. 73 ఏళ్ల వయసులో రజిని తన స్పీడును ఏమాత్రం తగ్గించకుండా జోరు పెంచుతూ ఉన్నారు. వయసు పెరుగుతున్న ఆయనలో హుషారు మాత్రం తగ్గడం లేదు. జైలర్ చిత్రంలో ఆయన యంగ్ అండ్ డైనమిక్ లుక్ లో కనిపిస్తున్నారు. జైలర్ సినిమాలో ఈయన ముత్తు వేలు పాండియన్ పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్రతో ఆయన ఎలా మెస్మరైజ్ చేస్తాడో చూడాలి. ఇక ఇందులో రజిని సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో చాలా చిత్రాలు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నరసింహ. నరసింహగా రజినీకాంత్ నీలాంబరిగా రమ్యకృష్ణ అత్యద్భుత నటనతో ఈ చిత్రం మర్చిపోలేని ఘన విజయాన్ని సాధించింది. అంత మించిన పాత్ర తో మరల రజిని పక్కన హీరోయిన్‌గా చేస్తున్న ఆమె రజినీతో కలిసి ఎలాంటి మ్యాజిక్కులు చేస్తుందో చూడాలి.
ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను కూడా రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఇందులో రజనీ జైలర్ పాత్రలో కనిపించనున్నాడు. సెంట్రల్ జైల్ నేపథ్యంలో 24 గంటల వ్యవధిలో సాగే ఈ కథకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ కు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. రజిని అదిరిపోయే లుక్ కి తోడు అనిరుద్ రవిచంద్రన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. ఈ గ్లిమ్స్ కు యూట్యూబ్‌లో దాదాపు నాలుగు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌లో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమన్నా భాటియా లతో పాటు తెలుగు కమెడియన్ సునీల్ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. జైలర్ నుండి తొలి సాంగును ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయనున్నారు. సినిమాను వేసవికి ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఏప్రిల్ 14న ఈ మూవీని దేశవిదేశాలలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం రజిని ఈ వయసులో కూడా దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్ లో పాల్గొనడానికి సంసిద్ధుడు అవుతున్నాడని సమాచారం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
