సునీతకు ఇక దిగుల్లేదు!
on Jan 19, 2021

గాయనిగా తెలుగువారికి అత్యంత ఇష్టురాలైన ఉపద్రష్ట సునీత జనవరి 9న రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొంత కాలంగా స్నేహితుడైన రామ్ వీరపనేని ఆమె జీవిత సహచరుడు అయ్యారు. రామ్‌కు కూడా ఇది రెండో వివాహమే. ఈ వివాహం మీడియా సహా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. కారణం.. ఆమెకు టీనేజ్ దాటిన ఓ కొడుకు, కూతురు ఉండటమే. మొదటి భర్త కిరణ్‌తో దశాబ్దం క్రితమే ఆమె విడిపోయారు. అప్పట్నుంచీ ఇద్దరు పిల్లల్నీ ఆమే పెంచుతూ వచ్చారు. 42 ఏళ్ల వయసులో ఆమె రెండో వివాహానికి సిద్ధపడటంతో చాలా మంది ఆమె నిర్ణయానికి ఆశ్చర్యపోయారు. కొంతమంది విమర్శలూ చేశారు. పెళ్లీడు పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఈ పనేంటని ప్రశ్నించిన వాళ్లున్నారు. కానీ పిల్లల క్షేమం కోసంతో పాటు, తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూడా సునీత ఈ వివాహానికి అంగీకరించారని సన్నిహితులు అంటున్నారు.
రామ్ చాలా కాలం నుంచీ సునీత పిల్లలకూ తెలుసు. మ్యాంగో మ్యూజిక్ అధినేతగా సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్‌తో రామ్‌కు మంచి అనుబంధం ఉంది. ఆ క్రమంలోనే రామ్‌తో జరిగిన పరిచయం స్నేహంగా మారింది. రామ్ నుంచి పెళ్లి ప్రపోజల్ రావడంతో మొదట సందేహించిన ఆమె తర్వాత పిల్లలు, తల్లిదండ్రులతో ఈ విషయం చర్చించారనీ, వారు ఆమె రెండో వివాహం చేసుకోవడం కరెక్టని సమర్థించారనీ తెలుస్తోంది. రామ్ ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో మెరుగ్గా ఉండటం కూడా ఆమె నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని వినికిడి. రామ్‌కు మ్యూజిక్ కంపెనీతో పాటు యూట్యూబ్ చానల్స్, వెబ్‌సైట్స్ లాంటి డిజిటిల్ బిజినెస్‌లు ఉన్నాయి. వాటి ద్వారా ఆయనకు మంచి ఆదాయం వస్తోంది. అలాగే కోట్ల రూపాయల విలువ చేసే స్థిరాస్తులు కూడా ఉన్నాయి.
ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన సునీత భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతోనూ రామ్‌తో పెళ్లికి మొగ్గినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అలా సునీత వివాహం జరిగింది. ఈ వివాహం ఆమెకు ఎంతటి ఆనందాన్నిచ్చిందో పెళ్లినాటి పలు ఫొటోలు, వీడియోలు తెలియజేశాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



