గోదావరిఖని కోల్ మైన్స్‌లో ప్రభాస్?
on Jan 19, 2021

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న యాక్షన్ సాగా సలార్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ భారీ బడ్జట్ మూవీకి సంబంధించి.. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
వినిపిస్తున్న కథనాల ప్రకారం.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పరిసర ప్రాంతాల్లో సలార్ కి సంబంధించి తొలి షెడ్యూల్ ని ప్లాన్ చేశారట దర్శకుడు ప్రశాంత్ నీల్. అక్కడి కోల్ మైన్స్ లో ప్రభాస్ తదితరులపై ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేశారట. దాదాపు రెండు వారాల పాటు ఈ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ జరుగుతుందని అంటున్నారు. జనవరి 26 తరువాత ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటారని టాక్. కాగా, ఈ ఏడాది విజయదశమి సీజన్ లో సలార్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
కాగా, మరోవైపు ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న మైథలాజికల్ డ్రామా ఆదిపురుష్ కూడా ఫిబ్రవరి 2 నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నారు. 2022 ఆగస్టు 11న ఆదిపురుష్ తెరపైకి రానుంది.
ఇక ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ ఈ వేసవిలోనే పలు భాషల్లో సందడి చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



