బాలీవుడ్ బెస్ట్ సింగర్ బిచ్చగాడైపోయాడు..!
on May 18, 2016

గాయకుడికి స్వరం ముఖ్యమా..రూపం ముఖ్యమా..? పైకి అందరూ స్వరం ఉంటే సరిపోతుందని అంటారు తప్పితే, అందంగా లేకపోతేఎవరూ కనీసం చూడను కూడా చూడరు. దీన్నే ప్రూవ్ చేశాడు బాలీవుడ్ గాన గంథర్వుడు సోనూ నిగమ్. లెక్కలేనన్ని అవార్డులు,రివార్డులు ప్రశంసలు అందుకున్న ఈ గాయకుడు చిన్న ప్రయోగం చేశాడు. బీయింగ్ ఇండియన్ అనే యూట్యూబ్ ఛానల్ లో కలిసి అతను చేసిన ఈ సోషల్ ఎక్స్ పెరిమెంట్ లో నగర జీవి తన ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం ఒక మంచిస్వరాన్ని ఆస్వాదించే తీరిక కూడా లేనంతగా ఎంతలా మారిపోయాడో తెలియజెప్పింది.
విషయంలోకి వెళ్తే, ముంబైలోని ఒక రద్దీ వీధిలో ఫుట్ పాత్ మీద ముసలి బిచ్చగాడి గెటప్ లో ప్రత్యక్షమయ్యాడు సోనూ నిగమ్. రోడ్డు పక్కన కూర్చుని తన హార్మోనియం పెట్టెను మోగిస్తూ, అద్భుతమైన పాటల్ని ఆలపించాడు. అయితే స్టేజ్ మీద సోనూనిగమ్ పాడిన పాటల్ని వేల రూపాయలకు టిక్కెట్లు కొని మరీ వినే జనాలు, అక్కడ రోడ్డు మీద అదే స్వరంతో పాడుతున్న ఆ ముసలి గాయకుణ్ని పట్టించుకోలేదు. ఎప్పుడో ఒక రెండు మూడు గంటలకు, ఒకళ్లిద్దరు పోగై విన్నారు తప్ప జనానికి అతన్ని చూసే తీరిక కూడా లేదు. ఒక కుర్రాడు మాత్రం ముందుకు వచ్చి, ఏదైనా తిన్నావా లేదా అని అడిగి, చేతిలో 12 రూపాయల్ని పెట్టాడు. ఆ తర్వాత తాను ప్రఖ్యాత సింగర్ ను అన్న మాటను వాళ్లకు చెప్పకుండానే నడుచుకుంటూ వెళ్లిపోయాడు ముసలాయన రూపంలో ఉన్న సోనూ. దేశంలో ఉన్న టాప్ మోస్ట్ సింగర్స్ లో ఒకరైన సోనూ స్వరాన్ని అక్కడెవరూ గుర్తుపట్టకపోవడం విచిత్రం. ఈ ప్రయోగం తనకు చాలా తెలియజెప్పిందని, తనకు ఆ అబ్బాయి ఇచ్చిన ఆ 12 రూపాయల్ని ఫ్రేమ్ కట్టి దాచుకున్నాడు సింగర్ సోనూ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



